మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
...