Medak, December 26: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
మెదక్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను కలుపుతూ రూ. 52.76 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ. 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం, జిల్లా స్వయం సహాయ మహిళా సంఘాలకు రూ. 100 కోట్లతో బ్యాంక్ లింకేజీ చెక్ అందజేత, రూ. 35 కోట్లతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
సీఎం పవర్యటనలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, సురేష్ షెట్కార్, మహేష్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.