Andhra Pradesh Rains: Heavy Rains in These Districts Over Low Pressure

Vizag, DEC 25: బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) కొనసాగుతోంది. చెన్నైకి 135 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో (నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, శీతల గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని తాలూకు కదలిక చాలా నెమ్మదిగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Cyclone Coming? మళ్లీ దూసుకొస్తున్న ఇంకో తుపాను? కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక 

అల్పపీడనం (Low Pressure) మధ్య భారత దేశం వైపు కదులుతూ బలహీన పడాల్సి ఉంది. అల్పపీడనం చాలా నెమ్మదిగా కదులుతూ ఉండటంతో రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో వానలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అయితే, మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇక, పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించింది. ధాన్యం తడవకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలంది.