Hyd, Sep 26: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రహదారులు జలమయం అయ్యాయి. పలు విమాన సర్వీసులు రద్దు కాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఇక ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
భారీ వర్షాలతో ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ముంబైలోని కొన్ని ప్రాంతాలలో బుధవారం సాయంత్రం 5 మరియు రాత్రి 10 గంటల మధ్య 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తొలుత ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసిన భారత వాతావరణ విభాగం తర్వాత రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం ఉదయం 8:30 గంటల వరకు ముంబై, థానే మరియు రాయ్‌గఢ్‌లకు రెడ్ అలర్ట్‌గా ప్రకటించింది. పలు చోట్ల భారీ వర్షాలు, ఉరుము లు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ముంబైకి మళ్లీ భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు
Here's Video:
#WATCH | Navi Mumbai, Maharashtra: Heavy rain causes water logging in several parts of the city.
(Visuals from Belapur) pic.twitter.com/OZpuMnPFGI
— ANI (@ANI) September 25, 2024
బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలోని అంధేరీలోని ఎంఐడీసీ ప్రాంతంలో ఓపెన్ డ్రెయిన్‌లో విమల్ గైక్వాడ్ అనే 45 ఏళ్ల మహిళ మునిగిపోయింది.
శివాజీనగర్‌లో కుండపోత వర్షం కురియగా 86 సంవత్సరాల తర్వాత ఇంత పెద్దమొత్తంలో వర్షాపాతం రికార్డు అయింది. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌పై వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Here's Video:
#WATCH | Maharashtra: Visuals from Mumbai's Marine Drive after heavy rainfall yesterday.
As per IMD, Mumbai is likely to experience a 'generally cloudy sky with heavy rain' today. pic.twitter.com/j98vtQomUF
— ANI (@ANI) September 26, 2024
#WATCH | Maharashtra: Normal life remains unaffected despite yesterday's heavy rainfall in Mumbai.
As per IMD, Mumbai is likely to experience a 'generally cloudy sky with heavy rain' today.
(Visuals from CSMT) pic.twitter.com/CrdqJaIDW1
— ANI (@ANI) September 26, 2024
#WATCH | Maharashtra: Moving traffic witnessed in Mumbai's Bandra area after heavy rainfall yesterday.
As per IMD, Mumbai is likely to experience a 'generally cloudy sky with heavy rain' today. pic.twitter.com/CbBbp47TgU
— ANI (@ANI) September 26, 2024