Delhi, Jan 24: వన్రాయ్ పోలీసులకు ఒక మహిళ తనకు గ్యాంగ్ రేప్(Gang Rape), పీడన జరిగినట్లు చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల మహిళ ఇటీవల గోరేగావ్ ఈస్ట్‌లో వ్యక్తిగత భాగాల్లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు ఉండగా చికిత్స కోసం తీసుకొచ్చారు. దీంతో పోలీసులు(Mumbai Police) విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం...నలసోపారాలో తన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో నివసిస్తోంది మహిళ. అయితే తొలుత తాను అనాధనని మామ దగ్గర వారణాసిలో పెరిగినట్లు చెప్పింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారని నలసోపారాలో ఉంటున్నారని వెల్లడించింది. అయితే తన తండ్రి తల్లిని రోజు కొట్టే వాడని ఇలా జనవరి 21న తండ్రితో ఘర్షణ తర్వాత, పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిందని పోలీసులు తెలిపారు.
అక్కడి నుండి నలసోపారా(nalasopara) స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ను కలుసుకుంది. అతనికి తన కుటుంబ సమస్యలు, ఆత్మహత్య ఆలోచనల గురించి చెప్పింది. దీనిని అదునుగా మలుచుకున్న ఆటో డ్రైవర్ ఆమెను ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ రెండు సార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. అనంతరం ఆమెను నలసోపారా స్టేషన్ వద్ద వదిలేశాడని తెలిపింది. పైసలు లేకపోయినా రైలు టికెట్.. భారతీయ రైల్వే నుంచి ‘బుక్ నౌ.. పే లేటర్’ స్కీమ్
ఆమె చెప్పిన వివరాలపై ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని ఆటో డ్రైవర్(Auto Driver)పై అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే, ఆమె కుటుంబ సభ్యులను విచారించగా తరచుగా ఆమె ఇంటి నుంచి పారిపోవడం, మానసిక సమస్యలతో బాధపడటం వంటి విషయాలు తెలిశాయని పోలీసులు తెలిపారు. దీనిని గ్యాంగ్ రేప్ గా మలిచేందుకు ప్రయత్నించిందని ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు.