Railway (X)

Newdelhi, Jan 24: డబ్బులు (Money) లేకపోయినా ఇకపై రైలు టికెట్‌ ను బుక్‌ చేసుకోవచ్చు.‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ ('Book Now, Pay Later' Scheme) పేరుతో భారతీయ రైల్వే ఈ  సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పే లేటర్‌ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుగా www.epaylater.in అనే వెబ్‌ సైట్‌ లో రిజిస్టర్‌ చేసుకోవాలి. టికెట్‌ బుక్‌ చేసుకున్నాక పేమెంట్‌ ఆప్షన్‌ ను ఎంపిక చేసుకునేటప్పుడు ‘పే లేటర్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఇంకా కొనసాగుతున్న ఐటీ సోదాలు.. నాలుగో రోజూ తనిఖీలు

డబ్బుల సంగతేంటి?

టికెట్‌ బుక్‌ చేసుకున్న 14 రోజుల్లోగా ఆ డబ్బులు చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం 3.5 శాతం సర్వీస్‌ చార్జ్‌ కట్టాల్సి ఉంటుంది. చెల్లింపు ఆలస్యమైనా కొద్ది చార్జీ పెరుగుతుంది. ఈ మేరకు రైల్వే అధికారులు తెలిపారు.

దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. కర్ణాటకలో గుర్తింపు