Bengaluru, Jan 24: దేశంలో మళ్లీ మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపుతోంది. దుబాయ్ (Dubai) నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన సదరు వ్యక్తి గడిచిన 19 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాడు. ఓ పనిమీద ఈ నెల 17న మంగళూరుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన శరీరంపై దద్దుర్లు రావడం, స్వల్పంగా జ్వరం వంటివి జరిగాయి. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అనుమానం వచ్చిన వైద్యులు అతని శాంపిల్స్ తీసుకుని పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఈ క్రమంలోనే నమూనాలను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్ గా నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది.
A 40-year-old man from #Udupi District, #Karnataka tested positive for monkeypox after arriving from #Dubai.
He is now stable in isolation.
Know more 🔗 https://t.co/71jZcVc1zN pic.twitter.com/BkxqmFkW8o
— The Times Of India (@timesofindia) January 23, 2025
ఈ ఏడాది తొలి కేసు
ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని, అతన్ని ఐసోలేషణ్ లో ఉంచమని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉందని వైద్య శాఖ పేర్కొంది. కాగా ఈ ఏడాది దేశంలో వెలుగు చూసిన మొదటి మంకీ పాక్స్ కేసు ఇదే. గత ఏడాది ఈ వ్యాధి తీవ్ర అందోళన కలిగిన సంగతి తెలిసిందే.
నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు