IT Raids In Dil Raju House (Credits: X)

Hyderabad, Jan 24: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు (Dil Raju) చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు (IT Raids) నాలుగో రోజు కూడా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయమే 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో మంగళవారం మొదలైన ఈ తనిఖీలు గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. శుక్రవారం ఉదయం సోదాలు నిలిపేసినట్టు తొలుత వార్తలు వచ్చినప్పటికీ, సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారి ఒకరు తెలిపారు. ఆదాయం, చెల్లింపుల్లో కొన్ని తేడాలను గుర్తించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. కర్ణాటకలో గుర్తింపు

వీళ్ల ఇండ్లల్లో కూడా

దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై, మైత్రీ మూవీస్ కార్యాలయం, డైరెక్టర్ సుకుమార్, మాంగో మీడియా ఆఫీసుల్లో  కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

నిరాశ, నిస్పృహలకు చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన స్ప్రావటోకు ఎఫ్ డీఏ అనుమతులు

నేడు ‘దిల్ రాజు’ ప్రెస్ మీట్

ఐటీ సోదాలపై నేడు దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన గేమ్ చేంజర్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలు ఇటీవల విడుదల అవ్వడం, అవి రెండూ దిల్ రాజు కాంపౌండ్ మూవీలే కావడం తెలిసిందే.