Hyd, May 17: అమెరికాలో( America) జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) వ్యక్తి మృతి చెందాడు. అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.
భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. తన భార్యను కారులోనే ఉంచి తాను ఫోన్ చేయడానికి బయటకు వచ్చాడు. అంతలోనే మృత్యువు మరో కారు రూపంలో తరుముకొచ్చింది. వేరే కారు అతడిని ఢీ కొట్టిడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారులో మంటలు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో బయటపడిన భక్తులు
విద్యుత్తు శాఖ విశ్రాంత ఉద్యోగి అయిన పృథ్వీరాజ్ తండ్రి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది. ఆయన రెండేళ్ల కిందటే మృతి చెందారు. పృథ్వీరాజ్ 8 ఏళ్లుగా అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. స్నేహితుల సాయంతో శవ పరీక్ష అనంతరం ఆదివారంలోపు మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు.