నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం జారీ చేసిన తాజా బులెటిన్ ప్రకారం, ఈ తుఫాను అక్టోబర్ 28 ఉదయానికి ‘తీవ్ర వాయుగుండం’గా (Severe Cyclonic Storm) మారే అవకాశం ఉందని తెలిపింది.
...