ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 15 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడిగా ఖరారు చేసింది.
...