జమ్మూ కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో సిపాయి పంగల కార్తీక్ వీరమరణం పొందారు. సైనికాధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. జలూర గుజ్జర్ పటిలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లాయి.
...