Soldier Karthik (Credits: X)

Srinagar, Jan 21: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని సోపోర్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌ కౌంటర్‌ (Encounter) లో సిపాయి పంగల కార్తీక్‌ వీరమరణం పొందారు. సైనికాధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం..  జలూర గుజ్జర్‌ పటిలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గాయపడిన కార్తిక్‌ ను, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ఆర్మీ అధికారులు ముమ్మరం చేశారు. కార్తీక్‌ ప్రాణ త్యాగం చేశారని, ఆయనకు చినార్‌ కోర్‌ లోని అన్ని ర్యాంకుల సిబ్బంది, అధికారులు గౌరవ వందనం చేస్తున్నారని భారత సైన్యంలోని చినార్‌ కోర్‌ ఓ పోస్ట్‌ లో తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపింది.

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు.. భయాందోళనకు గురయిన కార్మికులు, స్థానికులు (వీడియో)

చిత్తూర్ అబ్బాయి..

ఉగ్రమూకల చేతిలో మరణించిన సిపాయి కార్తీక్ స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని బంగారు పాల్యం మండలం రాగిమానుపెంట గ్రామంగా తెలుస్తుంది. 2017లో కార్తీక్ ఆర్మీలో చేరారు. ఆయన మరణ వార్త గ్రామంలో విషాదచాయలను నింపింది.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు