Mulugu, Nov 22: ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలం జంగాలపల్లిలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతులను ఉయిక రమేశ్, ఉయిక అర్జున్ గా పోలీసులు గుర్తించారు. రమేశ్ పంచాయతి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. హత్య అనంతరం వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఆ ప్రాంతంలో ఓ లేఖ వదిలివెళ్లారు. మృతులను పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేందంటూ, ఈ క్రమంలోనే హత్య చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరై ఉంటారని పోలీసులు ఆరాతీస్తున్నారు. మావోయిస్టులు నేరుగా పాల్గొన్నారా లేదా సానుభూతిపరులా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరిని హత్య చేసిన మావోలు
వాజేడు మండలం జంగాలపల్లి లో ఘటన
మృతులు అర్జున్, రమేష్ గా గుర్తింపు
పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న మృతుడు రమేష్
చంపిన తరువాత లేఖ వదిలి వెళ్లిన మావోయిస్టులు
వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి… pic.twitter.com/P3z73m2n1G
— BIG TV Breaking News (@bigtvtelugu) November 22, 2024
సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్
జంట హత్యలతో ఏజెన్సీలో మళ్లీ అలజడి నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీలో ఇన్ ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.