Hanuman Idol Set on Fire: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)

తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారడం కలకలం రేపుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది.

Hanuman Idol Set on Fire: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)
Hanuman Idol Set on Fire (Credits: X)

Hyderabad, Nov 22: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) దేవాలయాలపై (Temples) దాడులు నిత్యకృత్యంగా మారడం కలకలం రేపుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది. ఆలయం ప్రాంగణంలోని హనుమాన్ విగ్రహం దగ్ధమయ్యింది. గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు.

గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

Here's Video:

ఊరికి అరిష్టమంటూ..

ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? అనే కోణంలో పోలీసులు  దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఊళ్లోని హనుమాన్ విగ్రహం దగ్ధం అవడం ఊరికి అరిష్టమంటూ గ్రామస్తులు భయందోళనలకు గురవుతున్నారు.

వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు

(The above story first appeared on LatestLY on Nov 22, 2024 08:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).