Anakapalli, Jan 21: అనకాపల్లి (Anakapalli) జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. విషయంలోకి వెళితే.. ఉదయం ఫార్మా సిటీలోని మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో మంటలు అంటుకోవడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు
Here's Video
అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో చెలరేగిన మంటలు
ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు
ఈటీబీ ప్లాంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున చెలరేగిన మంటలు
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఎటువంటి ప్రాణ… pic.twitter.com/TszJA1kAYw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 21, 2025
ఎవరికీ ఏమీ కాలేదు!
తాజా అగ్ని ప్రమాదంలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని ప్లాంట్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరగడం ఇది తొలి సారి కాదు. తరచూ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫార్మా సిటీలో అగ్నిప్రమాదాలు జరగడం కార్మిక లోకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు