Vijay Rangaraju alias Raj Kumar Dies (photo-X)

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. దీంతో చికిత్స కోసం ఆయన చెన్నైకి వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

గుండెపోటుతో మృతి చెందిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రీతిష్ నంది, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నటుడు అనుపమ్ ఖేర్

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైటర్ గా ఆయన 5 వేలకు పైగా సినిమాల్లో రాజ్ కుమార్ నటించారు. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ 'భైరవద్వీపం' ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. గోపీచంద్ న‌టించిన‌ ‘యజ్ఞం’ సినిమాలో ఆయ‌న విల‌న్‌గా న‌టించ‌డం అత‌డి కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆయ‌న చెప్పుకోచ్చారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. విజయ్ రంగరాజు పుట్టింది పూణెలో. పెరిగింది ముంబైలో. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత రంగరాజు గుంటూరులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. పోలీసులు కావాలనుకున్న ఆయన అనుకోకుండ సినిమాల్లోకి వచ్చినట్టు గతంలో ఎన్నో ఇంటర్య్వూలో పేర్కొన్నారు.