ప్రముఖ బాలీవుడ్ నిర్మాత  ప్రీతిష్ నంది ఈరోజు గుండెపోటుతో  కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ప్రీతిష్ నంది మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ప్రియమైన మిత్రుడు ప్రీతిష్ నంది మరణ వార్తను తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యానని అనుపమ్ ఖేర్ అన్నారు. ప్రీతిష్ నంది ఒక అద్భుతమైన కవి, రచయిత, ఫిలిం మేకర్, జర్నలిస్ట్ అని కొనియాడారు.

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ నివసిస్తున్న భవనంలో ఘోర అగ్నిప్రమాదం, ఒకరు మృతి, వీడియో ఇదిగో..

మరోవైపు జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన ప్రీతిష్ రచయితగా, నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రీతిష్ నంది... వెబ్ సిరీస్ లను కూడా నిర్మించారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రీతిష్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Pritish Nandy Dies:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)