Dil Raju (Credits: X)

Hyderabad, Jan 21: మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు (Dil Raju) చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు

వీళ్ల ఇండ్లల్లో కూడా

దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గుండెపోటుతో మృతి చెందిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రీతిష్ నంది, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నటుడు అనుపమ్ ఖేర్

‘దిల్’ కాంపౌండ్ మూవీలే

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన గేమ్ చేంజర్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలు ఇటీవల విడుదల అవ్వడం, అవి రెండూ దిల్ రాజు కాంపౌండ్ మూవీలే కావడం తెలిసిందే.