ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
...