SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి
Group 1 candidates approached Supreme Court(X)

Vjy, Jan 27: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు (SC Dismisses Jagan's Bail Cancellation Petition) ఆదేశాలిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని సుప్రీం గుర్తుచేసింది.

జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై నేడు విచారణ జరిపింది. అయితే జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు కోసం ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని తెలిపింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందని పేర్కొంది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను (Jagan's Bail Cancellation Petition) వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు సూచించింది.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ వేసిన సంగతి విదితమే. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. గత 12 ఏళ్లుగా ఈ కేసు నత్త నడకన సాగుతోందని ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌ కూడా డిస్పోజ్‌ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్‌ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్‌ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్‌ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్‌ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది.

 

(The above story first appeared on LatestLY on Jan 27, 2025 01:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).