Narasaraopet Fire: నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన మూడు కార్లు.. రూ.50 లక్షల ఆస్తి నష్టం..వీడియో ఇదిగో..
Narasaraopet Fire: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వినుకొండ రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి ఎన్‌ఎస్‌బీ కార్ డెకార్ సెంటర్‌లో సిబ్బంది వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన సిబ్బంది సర్వీసింగ్ సెంటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో షాప్‌లో ఉన్న మూడు కార్లకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీడియో ఇదిగో.. పబ్లిక్‌లో జుట్లు పట్టుకొని, ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్న యువతులు.. బెంగళూరులోని కబ్బన్ పార్క్ వద్ద రీల్స్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ
Four cars gutted in fire at car decor shop in Narasaraopet.
VIDEO | Andhra Pradesh, Palnadu: Four cars gutted in fire at car decor shop in Narasaraopet.
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/uwfadc6MSk
— Press Trust of India (@PTI_News) August 18, 2026
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 2026 05:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

