తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.
...