Vij, Aug 11: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.
నైరుతి రుతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి ఆవరించి ఉండటంతో భారీ వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నాలుగు రోజులు, ఏపీలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
రాయలసీమ ప్రాంతంలో ఇవాళ, రేపు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు, అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది. వీడియో ఇదిగో, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్...భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు, విద్యుత్ నిలిపేసిన అధికారులు
తెలంగాణలోని ములుగు, భూపాల్ పల్లి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడె జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాక అధికారులు.