పర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ఏపీ టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ వినతికి సీఎం చంద్రబాబు (Chandrababu) వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పర్యాటకశాఖ పునరుద్ధరించనుంది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది.
...