Tirumala Darshan Tickets For Tourism Department: ఇకపై పర్యాటక శాఖ నుంచి తిరుమల దర్శన టికెట్లు, అన్ని రాష్ట్రాల ఆర్టీసీ, పర్యాటక శాఖ ద్వారా దర్శన టికెట్లు జారీ

పర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ఏపీ టూరిజం ఛైర్మన్‌ నూకసాని బాలాజీ వినతికి సీఎం చంద్రబాబు (Chandrababu) వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పర్యాటకశాఖ పునరుద్ధరించనుంది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది.

Tirumala Darshan Tickets For Tourism Department: ఇకపై పర్యాటక శాఖ నుంచి తిరుమల దర్శన టికెట్లు, అన్ని రాష్ట్రాల ఆర్టీసీ, పర్యాటక శాఖ ద్వారా దర్శన టికెట్లు జారీ
TTD good news for Telangana public representatives(X)

Tirupati, FEB 13: ఇకపై పర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ఏపీ టూరిజం ఛైర్మన్‌ నూకసాని బాలాజీ వినతికి సీఎం చంద్రబాబు (Chandrababu) వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పర్యాటకశాఖ పునరుద్ధరించనుంది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది. రోజుకు ఏపీఎస్‌ఆర్టీసీకి వెయ్యి టికెట్లు, ఏపీ పర్యాటక శాఖకు వెయ్యి, గోవా పర్యాటక శాఖకు 100, ఇండియన్‌ రైల్వేస్‌కు 250, ఇండియన్‌ టూరిజం విభాగానికి 100, కర్ణాటక పర్యాటక శాఖకు 500, తెలంగాణ పర్యాటక శాఖకు 350, తెలంగాణ ఆర్టీసీకి 1,000, తమిళనాడు పర్యాటక శాఖకు 1,000, పుదుచ్చేరి పర్యాటక శాఖకు 100 కలిపి మొత్తం 5,400 టికెట్లను జారీచేసింది. ఆయా రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసి ప్రజారవాణాకు ఆదాయాన్ని పెంచేందుకు వీటిని కేటాయించినట్లు అప్పట్లో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది.

Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో 

రూ.300 ఎస్‌ఈడీ టికెట్లను ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా భక్తులకు అందించేవారు. ఇక్కడే అసలు దోపిడీ జరిగింది. పర్యాటక శాఖ, ఆర్టీసీల నుంచి టికెట్లు పొందిన ఏజెంట్లు సామాజిక మాధ్యమాల్లో వాటిని విక్రయానికి ఉంచారు. దర్శన టికెట్లు కావాలని సంప్రదించినవారికి రూ.300 టికెట్‌ను డిమాండ్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు విక్రయించారు.

Secunderabad Railway Station Renovation: పూర్తి మారిపోనున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ రూపురేఖలు, ఇకపై ఆ బిల్డింగ్‌ కనిపించదు  

రూ.300 టికెట్ల అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ వీజీవో రామ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఈ ఫిర్యాదులపై దర్యాప్తుచేయగా రోజూ పెద్దఎత్తున భక్తులు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నట్లు గుర్తించారు. సదరు నివేదికపై స్పందించిన టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతోపాటు, వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, ఆర్టీసీలకు కేటాయించే రూ.300 టికెట్లను రద్దు చేస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఏపీ టూరిజం ఛైర్మన్‌ విజ్ఞప్తి మేరకు ఏపీ పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

(The above story first appeared on LatestLY on Feb 13, 2025 10:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).