Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో

ఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో
Teachers Lock Up First class Student Inside Classroom and Leave(X)

ఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ సమయం అయిపోగానే విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లిపోగా ఉపాధ్యాయులు గదులకు తాళాలు వేసి వెళ్లిపోయారు.

అయితే ఒకటో తరగతి విద్యార్థి శరత్ నిద్రపోవడంతో గదిలోనే ఉండిపోయాడు(Student Inside Classroom). సాయంత్రం 3:30గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. 4 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి మల్లేష్ పాఠశాలకు వెళ్లి వెతికాడు.

కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో 

ఈ క్రమంలో ఓ తరగతి గది కిటికి తెరచి చూడగా శరత్ నిద్రించి కనిపించగా.. వెంటనే గది తాళం పగులగొట్టి కుమారుడిని బయటకు తీసుకువచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా టీచర్ల తీరును తప్పుబడుతున్నారు నెటిజన్లు.

Teachers Lock Up First class Student Inside Classroom and Leave

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 15, 1692 05:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).