ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. పాత భవనాలను కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్‌కు తలమానికంగా ఉండే రైల్వే స్టేషన్ ప్రధాన భవనాలను నేలమట్టం చేస్తున్నారు.
...