కన్నెపల్లిలోని సారలమ్మ (Kannepalli) గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు.
...