దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి (Telangana Residents released) లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు (Dubai Court) శిక్షను 25 ఏళ్లకు పెంచింది.
...