Five telangana residents released (PIC@ BRS @ X)

New Delhi, FEB 21: దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి (Telangana Residents released) లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్‌ కోర్టు (Dubai Court) శిక్షను 25 ఏళ్లకు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నేపాల్ వెళ్లి .. హతుని కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా.. మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు.

 

అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది. దీంతో దుబాయ్‌ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌ వచ్చారు. 18ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది.