Four years for LV Prasad Eye Institute at Siricilla(X)

Siricilla, Feb 9:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల(Siricilla) జిల్లాలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ని (KTR On LV Prasad Eye Insitute) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఏర్పాటు చేసి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైద్య బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు కేటీఆర్.

కృష్ణ సింధూర ఐ సెంటర్ (ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్) డాక్టర్ జి.ఎన్. రావు , అలాగే హెటెరో ఫౌండేషన్ కు ఈ కేంద్రం ఏర్పాటు కావడానికి సహకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. ఈ నాలుగేళ్లలో 87,000 కంటే ఎక్కువ అవుట్‌పేషెంట్ సేవలు, 6,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు (దాదాపు 45% ఉచితంగా) ప్రజలకు అందించిందన్నారు కేటీఆర్(KTR).  హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో

గత కొన్ని సంవత్సరాలుగా, ఈ కేంద్రం కార్నియా & గ్లాకోమా ప్రత్యేక శస్త్రచికిత్సలు కూడా నిర్వహించిందన్నారు. 18,000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి అని చెప్పారు కేటీఆర్.

Four years for LV Prasad Eye Institute at Siricilla

ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నిర్వాహకురాలు మనెమ్మ ఆర్, మమత ఎం (ఆప్తాల్మిక్ నర్సింగ్ అసిస్టెంట్), నిఖిల్ ఏ (విజన్ సెంటర్ కోఆర్డినేటర్), శ్రీకాంత్ పి (సెక్యూరిటీ), వెంకటేష్ ఎల్ (ఆప్టికల్స్) మరియు మిగతా బృందం సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పారు.ఇలాగే ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు కేటీఆర్.