కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికే మూడు కారిడార్లుగా హైదరాబాద్ మెట్రో పరుగులు పెడుతుండగా మరో ఐదు కారిడార్లలో మెట్రో రెండో దశను విస్తరించనున్నారు.
...