Hyd, Oct 9: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికే మూడు కారిడార్లుగా హైదరాబాద్ మెట్రో పరుగులు పెడుతుండగా మరో ఐదు కారిడార్లలో మెట్రో రెండో దశను విస్తరించనున్నారు.
మెట్రో సెకండ్ ఫేజ్ 76.2 కిమీలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఫోర్త్ సిటీ మినహా ఐదు కారిడార్లకు వేర్వేరుగా నివేదికలు అందజేశారు. ఇందుకు రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు అధికారులు.
డీపీఆర్ ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి... ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సైతం సానుకూలంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 18 శాతం కేంద్రం నిధులతో మెట్రోరైలు ప్రాజెక్టులను వేర్వేరు నగరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నిర్మిస్తున్నారు. అలాగే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం భరించే వాటా సాధారణంగా 15 శాతం ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రెండోదశలో 18 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు. వీడియో ఇదిగో, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి, ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
రాష్ట్రం తన వాటాగా 30 శాతం భరించేందుకు సిద్ధపడుతోండగా 4 శాతం పీపీపీ పెట్టుబడులకు అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. మిగిలిన 48 శాతానికి సంబంధించి జైకా వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటారు. తెలంగాణ కేబినెట్ అమోదం తెలిపాక కేంద్ర ప్రభుత్వం అనుమతికోసం పంపించనున్నారు.
కారిడార్ 4: నాగోల్ - శంషాబద్ విమానాశ్రయం 36.6 కిమీ
కారిడార్ -5:రాయదుర్గం - కోకాపేట నియో పోలీస్ 11.6 కిమీ
కారిడార్ -6: ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట 7.5 కిమీ
కారిడార్ -7: మియాపూర్ - పటాన్‌చెరు 13.4 కిమీ
కారిడార్ -8: ఎల్బీనగర్ - హయత్‌నగర్ 7.1 కిమీ