తెలంగాణలో ఈ వేసవికాలంలో ఎండలు మునుపటి కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023లో తెలంగాణలో ఎన్నడూలేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయట. ఈ వేసవి కాలంలో 48-49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని చెబుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే ఫిబ్రవరిలో ఎండలు మండిపడుతున్నాయి.
...