రోడ్డు పక్కన తోపుడు బండికొట్టుపై (Street Vendor) మద్యం బాటిల్ విక్రయిస్తున్న స్థావరంపై శేరిలింగంపల్లి సర్కిల్ జిహెచ్ఎంసి (GHMC) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు (Liquor Sales) చేపడుతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంహెచ్‌ఓ శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.
...