Hyderabad, FEB 06: రోడ్డు పక్కన తోపుడు బండికొట్టుపై (Street Vendor) మద్యం బాటిల్ విక్రయిస్తున్న స్థావరంపై శేరిలింగంపల్లి సర్కిల్ జిహెచ్ఎంసి (GHMC) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు (Liquor Sales) చేపడుతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంహెచ్‌ఓ శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. కొండాపూర్ జేవీజీ హిల్స్ ఫుట్‌పాత్ పక్కన రాజరాజేశ్వరి కాలనీలో తోపుడు బండిలో యధేచ్చగా మద్యం విక్రయాలు చేపడుతున్నట్లు కాలనీవాసులు డయల్ 100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించి వివిధ బ్రాండ్లకు చెందిన 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తోపుడు బండి కొట్టి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తోపుడు బండిపై బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ మహిళపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.