GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస..బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? .. కేటీఆర్ ఫైర్
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా(GHMC Council Meeting) మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు అమోదం తెలిపింది జీహెచ్‌ఎంసీ.
Hyd, Jan 30: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా(GHMC Council Meeting) మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు అమోదం తెలిపింది జీహెచ్‌ఎంసీ. అయితే ఈ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు(BJP Corporators) భిక్షాటన చేస్తూ సమావేశానికి వచ్చి నిరసన తెలపగా బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఇక బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,480 కోట్ల బడ్జెట్‌ను మేయర్ విజయలక్ష్మీ ప్రవేశ పెట్టారు.
ఈ క్రమంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్పొరేటర్ల(BRS Corporators) మధ్య తోపులాట జరిగింది. ఎంతకీ గొడవ సద్దుమనగక పోవడంతో మార్షల్స్‌ను పిలిచారు మేయర్. ఆ తర్వాత సభను ఐదు నిమిషాలు వాయిదా వేయగా సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? చెప్పాలని డిమాండ్ చేవారు.
brs corporators arrest on ghmc council meeting, KTR Condemns the BRS Corporators arrest
జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గం!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి…
— KTR (@KTRBRS) January 30, 2025
గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? చెప్పాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజావసరాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జిహెచ్ఎంసి అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు అన్నారు.
హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

