Hyd, Sep 18: తెలంగాణలోని జంట నగరాలైన సికింద్రాబాద్ - హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కానుంది. ఇక ఇప్పటివరకు 1లక్ష 2510 గణనాధులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగిందని వెల్లడించారు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4730, నెక్లెస్ రోడ్ 2360, పీపుల్స్ ప్లాజా 5230 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ అల్వాల్ కొత్తచెరువులో 6221 వినాయకులను నిమజ్జనం చేశామని...గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని వెల్లడించారు.
నిమజ్జనం త్వరగా పూర్తి చేసేందుకు సిటి పోలీస్ లో ఉన్న 25 వేలమంది సిబ్బంది మరియు ఇతర యూనిట్స్ రాత్రంతా 2 షిఫ్ట్స్ లో (సీనియర్ అధికారులు కాకుండా) నిర్విరామంగా కష్టపడి పనిచేశారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని వెల్లడించారు. వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి,ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి
Here's Video:
#BalapurGanesh Immersion Completed at Hussain Sagar Lake #Hyderabad #ganeshimmersion2024 #ganeshnimmajjnam pic.twitter.com/cUa09doLWG
— Hyderabad City Police (@hydcitypolice) September 17, 2024
వినాయక నిమజ్జనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందనే పలువురు చెబుతున్నారు.
ప్రధానంగా వినాయక మండపం నుంచి గంగమ్మ ఒడికి గణనాథులు చేరే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా బడా గణేశ్ విగ్రహాలను వీలైనంత త్వరగా నిమజ్జనం చేయడంతో కొన్ని గంటల వ్యవధిలోనే మిగితా వేల సంఖ్యలో గణనాథులను నిమజ్జనం చేశారు.
Here's Tweet:
నిమజ్జనం త్వరగా పూర్తి చేసేందుకు సిటి పోలీస్ లో ఉన్న 25 వేలమంది సిబ్బంది మరియు ఇతర యూనిట్స్ రాత్రంతా 2 షిఫ్ట్స్ లో (సీనియర్ అధికారులు కాకుండా) నిర్విరామంగా కష్టపడి పనిచేసారు.
గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉంది. ఉదయం 5 గంటలకి శోభాయాత్ర చివరి భాగం MJ…
— CV Anand IPS (@CVAnandIPS) September 18, 2024