Khairatabad Maha Ganapati Immersion: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ ఉదయం ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. మధ్యాహ్నానికి హుస్సేన్‌సాగర్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ఓ ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి
Here's Videos
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి
TG: వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం ఘనంగా పూర్తైంది. శోభాయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. ఈ క్రతువును కనులారా… pic.twitter.com/cF06OIyiYD
— ChotaNews (@ChotaNewsTelugu) September 17, 2024
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి. #KhairatabadGanesh2024 #Tankbund #Bigtv pic.twitter.com/bzJ8iYNf9s
— BIG TV Breaking News (@bigtvtelugu) September 17, 2024
తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర కన్నుల పండుగగా సాగిన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర pic.twitter.com/JXzzjlQK4V
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2024
నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ వినాయకుడు pic.twitter.com/nsDz8ppf3f
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2024
ఎందరో వేచి చూసిన అద్భుత దృశ్యం.. రానే వచ్చింది
తెలంగాణ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి pic.twitter.com/YuEBbIxZtP
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)