ఇప్పటికే కురిసిన ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపింది. వాయుగుండం కారణంగా ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
...