Hyd, Sep 12: ఇప్పటికే కురిసిన ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపింది. వాయుగుండం కారణంగా ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.

ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై బలంగా ఉండటంతో దీని కారణంగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఇవా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.

ఇక తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎండగా మరికొన్ని చోట్లు మేఘాలు ఉంటాయని చెప్పారు.  వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు 

భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం జరుగగా కేంద్రం బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించింది. వరద నష్టంపై ప్రాధమిక అంచనాకు రాగా ఈ నివేదిక ఆధారంగా కేంద్రం సాయాన్ని ప్రకటించనుంది.