హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మే 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ (MMTS Trains) సర్వీసులను, నాలుగు డెమూ (Demu) సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ వంతెనల (FOB) ల నిర్మాణం నేపథ్యంలో రెండు రోజులపాటు పలు రైలు సర్వీసులను రద్దు చేశారు.
...