Hyderabad, May 24: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మే 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ (MMTS Trains) సర్వీసులను, నాలుగు డెమూ (Demu) సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ వంతెనల (FOB) ల నిర్మాణం నేపథ్యంలో రెండు రోజులపాటు పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్-మేడ్చల్ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Cancellation of few MMTS & DEMU Trains due to Secunderabad Station Re-development Works on 25th and 26th May, 2024. pic.twitter.com/P2P33ekGwA
— South Central Railway (@SCRailwayIndia) May 24, 2024
వీటితోపాటు సిద్దిపేట-సికింద్రాబాద్ మధ్య సర్వీసులందించే నాలుగు డెమూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.