తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు.
...