తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. 48 గంటల్లోగా రాష్ట్రంలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధింపుపై (Lockdown or Curfew in TS) నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
...