Lockdown or Curfew in TS: తెలంగాణలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధింపు, 48 గంటల్లోగా తేల్చాలని కేసీఆర్ సర్కారుకి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా
KCR And High Court (Photo-File Iamge)

Hyderabad, April 18: తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. 48 గంటల్లోగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధింపుపై (Lockdown or Curfew in TS) నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోవిడ్‌ వ్యాప్తిపై (Coronavirus Second Wave) ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు (Telangana High Court) అసహనం వ్యక్తం చేసింది.

బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ర్యాలీలు, వివాహాలపై ఆంక్షలు విధించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్స్‌పై పర్యవేక్షణ ఏర్పాటు చేసి రోగులను కాపాడాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా అధికారులు సమర్పించిన కరోనా నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

సెకండ్ వేవ్ ఉధృతి.. కరోనా సోకిన 2-3 రోజుల్లోనే లక్షణాలు, తెలంగాణలో కొత్తగా 4,009 కోవిడ్ కేసులు నమోదు, సరిపడా వ్యాక్సిన్, ఆక్సిజన్ కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

మరోసారి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వెబ్‌సైట్‌లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలన్న హైకోర్టు.. జీహెచ్‌ఎంసీలో నమోదైన కరోనా కేసుల వివరాలు వార్డుల వారీగా సమర్పించాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ 24 గంటల్లోగా వచ్చేలా చూడాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో రద్దీ నియంత్రణ, ఎన్నికల సభలు, వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది.

ఓ కుటుంబం అంతా కరోనా బారినపడితే ఏవిధంగా సాయం చేస్తున్నారని అడిగింది. కరోనా బాధితులకు సత్వర చికిత్స అందేలా ఆర్టీపీసీఆర్ ఫలితం 24 గంటల్లోపే వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ సర్కారుకు స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు 24 గంటల్లోగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 22 లోగా అన్ని వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలు, స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు, కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన

మూడు రోజుల సరిపోదని మరింత సమయం కావాలని ఏజీ కోరగా మూడు రోజుల్లో మీరు చేయగలిగింది చేయండి మిగతాది మేము చేస్తాం అని తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. తాజా విచారణ సంధర్భంగా హజరైన వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీహెచ్ శ్రీనివాసులు ఈ నెల 23న జరిగే విచారణకు హజరుకావాలని ఆదేశించింది.