తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంటోంది. నిన్న చేవెళ్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్ ను మగాడివైతే వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
...