తెలంగాణకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం కాగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
...