Hyd, Sep 8: తెలంగాణకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం కాగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివార ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావొద్దని..ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1077ను సంప్రదించాలని సూచించారు.